Swayambhu Movie | ‘స్వయంభూ’ కోసం కత్తిసాము చేస్తున్న నిఖిల్.. వీడియో వైరల్
Swayambhu Movie | 'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddartha). ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో మరో పాన్ ఇండియా చిత్రం స్వయంభు (Swayambhu) చేస్తున్నాడు.
Swayambhu Movie | ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddartha). ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో మరో పాన్ ఇండియా చిత్రం స్వయంభు (Swayambhu) చేస్తున్నాడు. ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా.. మలయాళ భామ సంయుక్తామీనన్ (Samyuktha Menon) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇక హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాలో నిఖిల్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం నిఖిల్ కత్తి సాము వంటి యుద్ధవిద్యలు నేర్చుకుంటున్న విషయం తెలిసిందే.
రీసెంట్గా తన కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోను నిఖిల్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోలో నిఖిల్ తన పదునైన కత్తిని పట్టుకుని తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. “లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ .. ప్రాక్టీస్ & మోర్ ప్రాక్టీస్” అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌ను జోడించారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Left hand… Right hand… PRACTICE & More Practice #ambidextrous #swayambhu #sword #anime #martialarts pic.twitter.com/XZpA6JMmGJ
— Nikhil Siddhartha (@actor_Nikhil) November 4, 2023
స్వయంభు సినిమా నిఖీల్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తోంది. స్వయంభు చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. స్వయంభు చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. స్వయంభులో నిఖిల్ యుద్ధ వీరుడిగా ఇదివరకెన్నడూ కనిపించని సర్ప్రైజింగ్ లుక్‌లో మెరువబోతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

