Suriya: ఆకాశం నీ హద్దురా కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందా..!

తమిళ చిత్రం సూరరై పొట్ట్రు తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై బాలీవుడ్ కన్నుపడింది. త్వరలోనే హిందీలోను ఈ సినిమా రీమేక్ కానుంది.
ఇప్పటికే అటు వెబ్ సిరీస్ మరియు సినిమాలతో బిజీగా ఉన్న సుధా కొంగర బాలీవుడ్ లో గతంలో “సాలా ఖడూస్” చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఘన విజయం సాధించి తాజాగా “ఆకాశం నీ హద్దురా” చిత్ర రీమేక్ తో మరోసారి తన దర్శకత్వ ప్రతిభని చూపించింది. సుధ కొంగర మరోసారి సూర్యను డైరెక్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించిన కథ చర్చలు ఈ మధ్యనే ముగిసినట్టు సమాచారం. ఇదే జరిగితే ఈ కాంబినేషన్లో మరో సూపర్ హిట్ రావడం ఖాయం అంటున్నారు.
ఇక సూర్య నటిస్తున్న మరో సినిమా జై భీమ్ ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. అణగారిన, పేదల కోసం పాటుపడే లాయర్ పాత్రలో సూర్య ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా సూర్య గత చిత్రం ఆకాశం నీ హద్దురా మాదిరిగానే డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CBI Raids | రైస్ మిల్లర్లపై సీఐడీ దాడులు… నిజామాబాద్, కరీంనగర్, ములుగులో అక్రమాలు
RTC Conductor | కండక్టర్ ప్రాణం మీదికి తెచ్చిన ‘చిల్లర’.. భద్రాద్రి జిల్లాలో దారుణం
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

