Shah Rukh Khan | బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ మరోసారి తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలతో ట్రెండింగ్‌లో నిలిచారు. యశ్ చోప్రా దర్శకత్వంలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్ ‘డర్’ (Darr) సినిమా గురించి ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ పోషించిన విలన్ పాత్ర ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో కో-స్టార్‌గా షారుఖ్ వ్యవహరించిన తీరును, ఆయనలో ఉన్న కొన్ని బలహీనతలను సన్నీ డియోల్ ఓపెన్‌గా బయటపెట్టారు.
ఆ కాలంలో యంగ్ ఏజ్‌లో ఉన్న షారుఖ్ ఖాన్ తన పాత్ర విషయంలో తీవ్రమైన అభద్రతాభావంతో (Insecurity) ఉండేవారని సన్నీ డియోల్ గుర్తుచేసుకున్నారు. కేవలం తన పాత్ర ఎలా వస్తుందోననే ఆందోళనతో ఆయన ఎప్పుడూ దర్శకుడి చుట్టూ తిరుగుతూ, తన రోల్ గురించే పదే పదే చర్చలు జరిపేవారని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా చాలామంది నటులు తమ పాత్రల పరిధి గురించి అనవసరంగా భయపడతారని, ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ వల్ల సెట్స్‌లో వాతావరణం ఒత్తిడికి గురవుతుందని సన్నీ అభిప్రాయపడ్డారు. నటుడిగా తాను మాత్రం ఎప్పుడూ అలాంటి ఒత్తిడికి లోనుకాలేదని, ఒక ఆర్టిస్ట్ తన పాత్ర పరిధిలోనే నటించగలడని, అంతకుమించి ఎక్స్ట్రాగా ఏమీ చేయలేమని ఆయన స్పష్టం చేశారు. ఇక షారుఖ్‌తో ప్రస్తుత సంబంధాల గురించి మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో ఎవరూ ఎవరికీ శాశ్వత శత్రువులు కారని, అలాగని ప్రాణ స్నేహితులు కూడా కాదంటూ క్లారిటీ ఇచ్చారు. అందరూ కేవలం ఒకే రంగంలో పనిచేసే సహచరులు మాత్రమేనని ఆయన తేల్చిచెప్పారు.
Sunny Deol Reveals #ShahRukhKhan’s Insecure Side During His Young Days 🔥
While talking about Darr, #SunnyDeol revealed that Shah Rukh Khan was quite insecure at a young age and would constantly discuss his role with the director.
Sunny said many actors are insecure about their… pic.twitter.com/i2SGZ76BzZ
— Rahul Gupta (@RahulGupta25376) August 16, 2026