బుజ్జి ఇలా రా

హాస్యనటులు సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రానికి ‘బుజ్జి ఇలా రా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాందినితమిళరాసన్ కథానాయికగా నటిస్తోంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. బుజ్జి ఎవరు? ఇద్దరు వ్యక్తులతో ఆమెకున్న సంబంధమేమిటన్నది ఉత్కంఠను పంచుతుంది. సునీల్, ధన్‌రాజ్ పాత్రలు సరికొత్తగా సాగుతూ నవ్విస్తూనే థ్రిల్‌ను పంచుతాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, సత్యకృష్ణ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: జి.నాగేశ్వరరెడ్డి, సంగీతం: సాయికార్తిక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Bujji Ila Ra
- Danraj
- Sunil
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

