జ్ఞాపకాలను గుర్తుచేసే సినిమా
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్'. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రీకర్ దర్శకుడు.
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రీకర్ దర్శకుడు. ధీరజ్ మొగిలినేని నిర్మాత. నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘జనానికి నచ్చే కటెంట్‌తో రూపొందిన సినిమా ఇది.
థియేటర్స్‌లో కుటుంబసమేతంగా చూసి ఆనందించేలా సినిమా ఉంటుంది. ఇది పిల్లల సినిమా కాదు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసే సినిమా. పెద్దలకు బాల్యం గుర్తుస్తుంది. పిల్లలకు తమ జీవితాలను తెరపై చూసుకున్న అనుభూతి కలుగుతుంది. అందరికీ కనెక్టయ్యే సినిమా ఇది’ అని ధీరజ్ మొగిలినేని చెప్పారు. సినిమా మొత్తం చూసుకున్న తర్వాత పూర్తి సంతృప్తిగా ఫీలయ్యామని, కొన్నేళ్ల పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉండే సినిమా ఇదని దర్శకుడు శ్రీకర్ నమ్మకంగా చెప్పారు. సినిమాలో అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు బాలనటుడు రోహన్‌రాయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

