Telangana | తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతే అది సాధ్యమైంది.. గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అనుభవంతో చెప్పిన మాటలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మన మాటకు, పాటకు వివక్ష ఎదురైంది. ఆ అణచివేతను తట్టుకొని, తమ అవకాశాలను పణంగా పెట్టి పాటతో మన యాసభాషల గొప్పదనం చాటారు సినీ గీత రచయితలు. వారిలో ముందుంటారు సుద్దాల అశోక్ తేజ.
Telangana | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మన మాటకు, పాటకు వివక్ష ఎదురైంది. ఆ అణచివేతను తట్టుకొని, తమ అవకాశాలను పణంగా పెట్టి పాటతో మన యాసభాషల గొప్పదనం చాటారు సినీ గీత రచయితలు. వారిలో ముందుంటారు సుద్దాల అశోక్ తేజ. ఒకప్పుడు వివక్షకు గురైన తెలంగాణ యాస ఇప్పుడు సినిమాల్లో అధికారిక భాష హోదా పొందిందని సగర్వంగా చెబుతున్నారు. అశోక్ తేజ ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే..
ప్రస్తుతం తెలంగాణ భాష తెలుగు సినిమాకు అధికార భాష అయింది. తెలుగు తెరపై అద్భుత విజయాలు సాధించగలిగే వాహికగా మార్పు చెందింది. అంతకుపూర్వం సినిమాల్లో తెలంగాణ భాష అంటే కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి వంటి హాస్య నటులు, ప్రతినాయకుల పాత్రలకు మాత్రమే పెట్టేవారు. మనతోపాటు రాయలసీమ భాషను కూడా విలన్లకు ఉపయోగించేవారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, ‘దసరా’లో నాని వంటి హీరోలకు పెట్టుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతే ఈ మార్పు వచ్చిందన్నది..ఎవరు ఔనన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన సత్యం.
గాయపడిన రుద్రవీణ
తెలంగాణ ఉద్యమం కోసం అంతర్మథనం చేస్తున్న సమయం నుంచీ కేసీఆర్ గారితో నేను ఉన్నాను. తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని ఆయన నాతో చెప్పారు. ఆ ప్రయత్నంలో ఇరవై పాటలు రాశాను. వాటిని రికార్డు చేసి విడుదల చేశాం. తెలంగాణ నలుమూలల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ఇది తెలంగాణ… గాయపడిన రుద్రవీణ..’ అనే పాటతో మొదలుపెట్టాం. ‘గుంటూరు జిల్లాలో గుంటెడు జాగ అడిగినమా? విజయవాడ పట్నంలో వీసమెత్తు కోరినమా?..’ వంటి పాటలకు అనూహ్య ప్రజాదరణ లభించింది. వివిధ రాజకీయ పార్టీలను నిగ్గదీసి నిక్కచ్చిగా అడిగేలా ఎన్నో పాటలు రాశాను.
చరిత్ర గిర్రున తిరిగింది
ఫిదా సినిమాలో ‘వచ్చిండే..’ పాటను దాదాపు 40 కోట్ల మంది వీక్షించారు. ‘సారంగధరియా…’ పాటను 75 కోట్ల మంది చూశారు. ‘కొమురం భీముడో…’ పాటకు 45 కోట్ల వ్యూస్ వచ్చాయి. మేం ఏదైనా పాట రాస్తున్నప్పుడు ‘ఒక మంచి తెలంగాణ పదం వేయండి’ అని దర్శకులు అడుగుతున్నారు. చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. గిర్రున తిరుగుతుంది. యాస అనేది అమ్మ శ్వాస లాంటిది. తెలంగాణ యాస మాత్రమే కాదు ఉత్తరాంధ్ర యాస కూడా గొప్పదే. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా…’ పాటను తండోపతండాలుగా వెళ్లి విన్నం. యాసకు గొప్ప పీఠం ఉంది. ‘గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి..’ పాటతోనే నేను సినిమాల్లోకి గీత రచయితగా అడుగుపెట్టాను. ఆ పాటను ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర్లోని ఆరాధన థియేటర్లో రివైండ్ చేసుకుని మరీ ఎంజాయ్ చేసేవారు.
వెనకడుగు వేయలేదు..
‘జై బోలో తెలంగాణ’ చిత్రీకరణ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్నది. చిత్ర పరిశ్రమ అంతా సమైక్యాంధ్రను బలంగా కోరుతున్నది. అలాంటి సమయంలో తెలంగాణ నేపథ్య చిత్రాన్ని రూపొందించడం, దానికి పనిచేయడం కత్తి మీద నడక లాంటిది. దీనివల్ల మేం అనేక చిత్రాల్లో అవకాశాలు కోల్పోయాం అనేది చాలా మందికి తెలియని విషయం. అయినా వెనకడుగు వేయలేదు. అవకాశాలు తగ్గించాలని కొందరు చూసినా.. నా పాటలు నన్ను వెతుక్కుంటూనే వచ్చాయి. ‘రోబో’, ‘ఫిదా’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల కోసం నేను రాసిన పాటలు అలా వచ్చినవే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎక్కడి స్తంభాలు అక్కడే!
ఏఐ దెబ్బ.. ‘గెట్టి ఇమేజెస్’ దివాలా
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

