Rashi Khanna | ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో రాశి ఖన్నా పాత్రపై చర్చ.. ఆమె లాభపడింది ఏముంది?
Rashi Khanna | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలకు ముందు భారీ ప్రమోషన్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్లలో హీరోయిన్ రాశి ఖన్నా కూడా చురుకుగా పాల్గొని సినిమాపై అంచనాలను పెంచింది. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, రీల్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో కనిపిస్తూ తన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందని అభిమానుల్లో నమ్మకం కలిగించింది.
Rashi Khanna | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలకు ముందు భారీ ప్రమోషన్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్లలో హీరోయిన్ రాశి ఖన్నా కూడా చురుకుగా పాల్గొని సినిమాపై అంచనాలను పెంచింది. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, రీల్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో కనిపిస్తూ తన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందని అభిమానుల్లో నమ్మకం కలిగించింది. అయితే సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసిన తరువాత రాశి ఖన్నా పాత్రపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె పాత్ర ఫస్ట్ హాఫ్‌కే పరిమితం కావడం, అది కూడా మానసిక సమస్యలతో బాధపడే సైకో పేషెంట్‌గా చూపించడం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదని టాక్ వినిపిస్తోంది.
ఇక లుక్స్ విషయంలో కూడా రాశి ఖన్నా ఆకట్టుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘కాలర్ ఎత్తరా’ పాటలో పవన్ కళ్యాణ్‌తో కలిసి డాన్స్ చేసినప్పటికీ, ఆ పాట కూడా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదని సినీ వర్గాలు అంటున్నాయి. సినిమాలో పవన్ డాన్స్‌లే సాధారణంగా అనిపించినప్పుడు, రాశి ఖన్నా ప్రత్యేకంగా హైలైట్ అయ్యే అవకాశం లేకపోయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు సెకండాఫ్‌లో అయినా ఆమె పాత్రను తిరిగి తీసుకువచ్చి ఏదైనా కీలక సన్నివేశం ఇవ్వవచ్చని ప్రేక్షకులు భావించారు. కానీ దర్శకుడు హరీష్ శంకర్ ఆ దిశగా ఆలోచించలేదని తెలుస్తోంది. దీంతో రాశి ఖన్నా పాత్ర పూర్తిగా తేలిపోయిందనే విమర్శలు వస్తున్నాయి.
సినిమా కథ వినకుండా ఈ ప్రాజెక్ట్‌కి ఒప్పుకున్నానని రాశి ఖన్నా చెప్పడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కెరీర్ పరంగా పెద్ద ప్లస్ ఇవ్వని పాత్రలో నటించడం కంటే, తన పాత్ర నిడివి, ప్రాధాన్యం గురించి ముందుగానే చర్చించి ఉండాల్సిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక గత ఏడాది సిద్ధు జొన్నలగడ్డతో కలిసి చేసిన ‘తెలుసు కదా’ సినిమా కూడా రాశి ఖన్నాకు నిరాశనే మిగిల్చింది. దీంతో టాలీవుడ్లో ఆమెకు వరుసగా ఎదురవుతున్న ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. అయితే బాలీవుడ్లో మాత్రం రాశి ఖన్నా బిజీగా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు హిందీ సినిమాలు, ఒక తమిళ ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉన్నట్లు సమాచారం. ఆసక్తికరంగా, 2013లో మద్రాస్ కేఫ్ సినిమాతో జాన్ అబ్రహాంతో కలిసి హిందీలోనే కెరీర్ ప్రారంభించిన ఆమె, ఇప్పుడు మళ్లీ అక్కడ అవకాశాలు అందుకోవడం విశేషంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

