తాన్యదేశాయ్, అంకిత్‌రాజ్, కావ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్ట్రీట్ లైట్’. విశ్వ దర్శకుడు. మామిడాల శ్రీనివాస్ నిర్మాత. సెప్టెంబర్‌లో ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘ప్రతీకార కథాంశంతో తెరకెక్కుతున్న సందేశాత్మక చిత్రమిది. సమాజంలోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ రూపొందిస్తున్నాం. క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది. సెప్టెంబర్ మూడో వారంలో తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తాం’
అని తెలిపారు.