Sruthi Hassan | 16 ఏళ్ల తర్వాత తండ్రి కోసం లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన శృతి.. వీడియో వైరల్
Sruthi Hassan | కమల్ గారాల పట్టి శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ అనే విషయం మనందరికి తెలిసిందే. ఆమె నటిగానే కాదు గాయనిగా కూడా అలరిస్తూ ఉంటుంది. సినిమాలలో నటిస్తూ సమయం దొరికినప్పుడల్లా శృతి హాసన్ పాటలు పాడుతూ ఉంటుంది.కొన్నిసార్లు స్వయంగా మ్యూజిక్ కంపోజ్ కూడా చేస్తుంది.
Sruthi Hassan | కమల్ గారాల పట్టి శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ అనే విషయం మనందరికి తెలిసిందే. ఆమె నటిగానే కాదు గాయనిగా కూడా అలరిస్తూ ఉంటుంది. సినిమాలలో నటిస్తూ సమయం దొరికినప్పుడల్లా శృతి హాసన్ పాటలు పాడుతూ ఉంటుంది.కొన్నిసార్లు స్వయంగా మ్యూజిక్ కంపోజ్ కూడా చేస్తుంది. అయితే శృతి హాసన్ తన తండ్రి నటించిన ‘థగ్ లైఫ్’ మూవీ కోసం ‘విన్వేలి నాయకన్’ అంటూ సాగే పాటను స్టేజ్‌పై పాడి అదరగొట్టింది. ఆడియో లాంచ్ ఈవెంట్లో శృతి హాసన్ లైవ్ పర్ఫార్మెన్స్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. తన తండ్రి ముందు శృతి హాసన్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
శృతి హాసన్ తన పాటతో అందరు ఉర్రూతలూగించేలా చేసింది. శృతి పాట పాడిన వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేయగా, ఇప్పుడు ఈ వీడియో తెగ హల్చల్ చేస్తుంది. 2009లో కమల్ హాసన్ నటించిన ‘ఈనాడు’ సినిమాకి శృతి హాసన్ సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే. ఇందులో రీమిక్స్ తో కలిపి ఐదు పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేయగా, అందులో మూడు పాటలను తనే స్వయంగా పాడింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్ళీ తన తండ్రి కోసం గళం విప్పిన ఈ ముద్దుగుమ్మ ‘విన్వేలి నాయకన్’ అంటూ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది.
ఇక థగ్ లైఫ్ విషయానికి వస్తే.. లెజండరీ దర్శకుడు మణిరత్నం ఈ మూవీని తెరకెక్కించగా ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు శింబు, త్రిష, కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలే పెంచింది. విక్రమ్ రేంజ్లో ఈ మూవీ కూడా భారీ హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్‌తో కమల్ కూడా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

