Dimple Hayati | శ్రీవాస్.. నేను భైరవి పాత్ర చేస్తానా అనుకున్నారు : రామబాణంపై డింపుల్ హయతి చిట్‌చాట్
Dimple Hayati | గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రామబాణం (Ramabanam). డింపుల్ హయతి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మే 5న రామబాణం థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో డింపుల్ హయతి రామబాణం విశేషాలను మూవీ లవర్స్ తో పంచుకుంది.
Dimple Hayati | టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రామబాణం (Ramabanam). శ్రీవాసు దర్శకత్వం వహిస్తున్న రామబాణంలో డింపుల్ హయతి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మే 5న రామబాణం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలతో బిజీగా మారిపోయింది. తాజాగా హీరోయిన్ డింపుల్ హయతి రామబాణం విశేషాలను మూవీ లవర్స్ తో పంచుకుంది. రామబాణం గురించి డింపుల్ హయతి మాటల్లోనే..
రామబాణంలో ఎలా భాగమయ్యారు..?
ఖిలాడీ చేస్తున్న టైంలో రామబాణంకు సంతకం చేశా. ఖిలాడీ విడుదల తర్వాత రామబాణంలో భైరవి పాత్రలో నన్ను తీసుకునేందుకు వెనకాడారు. పక్కింటి అమ్మాయిలా కనిపించే పాత్రలో నటించే వ్యక్తిని వెతుకుతున్న క్రమంలో మేకర్స్ నాకు కొన్ని స్క్రీన్ టెస్టులు చేశారు. ఏదో అలా వర్కవుట్ అవడంతో రామబాణం ప్రాజెక్టులో భాగమయ్యా.
గోపీచంద్‌తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది..?
చాలా సంతోషంగా ఉంది. గోపీచంద్ చాలా తక్కువ మాట్లాడతారు.. సెట్స్‌లో కూడా ఎక్కువగా ఏం మాట్లాడరు. అలాంటి కెమిస్ట్రీలో పనిచేయడం నాకు కొంత ఛాలెంజింగ్‌గా అనిపించింది. నేను ఖిలాడీలో పనిచేసిన రవితేజ చాలా ఎనర్జిటిక్ పర్సన్. కానీ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్ పర్సన్‌తో పనిచేశా. గోపీచంద్ జెంటిల్మెన్. రామబాణం షూటింగ్లో నాకు చాలా సహకరించారు.
కథలో మీ పాత్ర ప్రాధాన్యత ఎలా ఉంటుంది..?
భైరవి పాత్ర సినిమా కథతో పూర్తిగా లింకప్ అయి ఏం ఉండదు. కానీ హీరోతో ప్రయాణించే పాత్ర. అందుకే నా పాత్ర ప్రేక్షకులకు చాలా వినోదాన్ని పంచేలా సాగుతూ.. కథలో లీనమవుతుంది. ఇంతకన్నా మించి ఎక్కువ చెప్పలేను.
రామబాణంలో వ్లోగర్‌గా కనిపించేందుకు ఎలాంటి హోం వర్క్ చేశారు..?
నేనెలాంటి హోం వర్క్ చేయలేదు. డైరెక్టర్ శ్రీవాస్‌గారు నాకు చాలా సాయం చేశారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేనెలా స్పందించాలనేది చెబుతూ.. కొన్ని సన్నివేశాల్లో సులభంగా నటించేందుకు సపోర్ట్ ఇచ్చారు. రెఫరెన్స్ కోసం కొన్ని యూట్యూబ్ వ్లోగ్స్ వీడియోలు చూశా.
నాన్ తెలుగు సినిమాల్లో నటించడానికి స్పూర్తి ఏంటి..?
తమిళ్లో కొన్ని సినిమాలు చేశా. కానీ చాలా మంది జనాలకు తెలియదు. ప్రస్తుతం నేను విభిన్న భాషల్లో ప్రయోగాలు చేయాలనుకుంటున్నా. అట్రాంగి రే గురించి మాట్లాడితే.. అది బాలీవుడ్ సినిమా. నేను అనుకున్నట్టుగా వస్తే ఎలాంటి ఛాలెంజ్ అయినా స్వీకరించేందుకు రెడీగా ఉన్నా.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి ఏం చెప్తారు..?
లీడింగ్‌లో ఉన్న ప్రొడక్షన్ హౌజ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. వారు హిట్ ఫార్ములాతో ముందుకెళ్తున్నారు. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల విధేయత కలిగిన వ్యక్తులు. ఎవరినీ ఇబ్బంది పెట్టుకుండా చాలా సులభంగా పని పూర్తయ్యేలా చేస్తారు.
మీ కొత్త సినిమాల గురించి..
ప్రస్తుతం ఓ తమిళ సినిమా చేస్తున్నా. నా నెక్ట్స్ తెలుగు సినిమా ప్రకటన కూడా త్వరలోనే ఉంటుంది. అయితే తమిళ సినిమా కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ రెండు సినిమాలు పెద్ద స్టార్లతోనే చేస్తున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

