Venu Udugula | నాకున్న అప్పులన్నీ శ్రీవిష్ణు తీర్చేశాడు : దర్శకుడు వేణు ఉడుగుల
SriVishnu | తెలంగాణ నేపథ్యంలో వాస్తవిక అంశాలతో కూడిన సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వారిలలో వేణు వుడుగుల ఒకరు.
Venu Udugula | తెలంగాణ నేపథ్యంలో వాస్తవిక అంశాలతో కూడిన సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వారిలలో వేణు వుడుగుల ఒకరు. నీది నాది ఒకే కథ(2018), విరాట పర్వం ఇలా తీసింది రెండు చిత్రాలే అయిన మంచి దర్శకుడిగా స్థానాన్ని నిలుపుకున్నాడు. తాజాగా అతడి నిర్మాణంలో వచ్చిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్‌హిట్‌ను అందుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ.. తన మొదటి సినిమా హీరో శ్రీవిష్ణు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుని ఇటీవల భావోద్వేగానికి లోనయ్యారు.
శ్రీవిష్ణు కథానాయకుడిగా వేణు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’ (2018). ఈ సినిమా సమయంలో తన ఆర్ధిక ఇబ్బందుల గురించి వేణు తాజాగా మాట్లాడుతూ.. నా మొదటి సినిమా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, నేను కొన్ని తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాను. అప్పులు చాలా ఉండేవి. ఒకరోజు నన్ను శ్రీవిష్ణు చూసి ఎందుకు మీరు ఇలా ఉంటారు ఎప్పుడు ఏదో బాధతో అని అడిగాడు. ఏమైన అప్పులు ఉన్నాయా అంటూ తెలుసుకున్నాడు. నేను కూడా చిన్న చిన్నవే అంటూ చెప్పాను. దీంతో నా పరిస్థితి తెలుసుకున్న శ్రీ విష్ణు ఆ మరుసటిరోజే నాకున్న అప్పులన్నీ తీర్చేశాడు. ఆయనకు ఏం అవసరం ఇది చేయడానికి.. అయిన కూడా చేశాడు. ఆరోజు శ్రీవిష్ణు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన నా సినిమాకు కేవలం హీరో మాత్రమే కాదు, నా కష్టకాలంలో నాకు అండగా నిలబడిన ఒక దైవంగా భావిస్తాను అంటూ వేణు చెప్పుకోచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

