Srinivasa Mangapuram | టాలీవుడ్ యువ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతుండగా, రవీనా టాండన్ కూతురు రాషా థడాని హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ “అలేల్లే అలేల్లే” (Alelle Alelle) ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పాటకు శ్రీమణి (Shree Mani) సాహిత్యం అందించగా జి.వి. ప్రకాష్ కుమార్ & హరిప్రియ కలిసి పాడరు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. జయకృష్ణ ఘట్టమనేని, రాషా థడానితో పాటు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘RX 100’, ‘మంగళవారం’ వంటి వైవిధ్యమైన చిత్రాల తర్వాత అజయ్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సమర్పిస్తున్నారు. ఇది ఒక ఇంటెన్స్ లవ్ డ్రామాగా రూపొందుతోంది.
Get ready to feel the love ❤️#SrinivasaMangapuram First Single #AlelleAlelle on 29th April 🫶🏻
A @gvprakash Musical 🎵
Lyrics by @ShreeLyricist
Sung by #GVPrakash @HariPriyaSinger#JayaKrishnaGhattamaneni #RashaThadani@themohanbabu @DirAjayBhupathi @AshwiniDuttCh… pic.twitter.com/m8JbV9hv86— Ajay Bhupathi (@DirAjayBhupathi) April 25, 2026