సినిమాల పరంగా విజయాలు తక్కువే అయినా అచ్చ తెలుగందం శ్రీలీల క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అందుకు యూత్‌లో ఈ భామకున్న ఫాలోయింగ్‌ను కారణంగా చెప్పొచ్చు. చూడముచ్చటైన రూపలావణ్యం, చలాకీ నటనతో ఈ భామ కుర్రకారులో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సొగసరి సినిమాల కంటే సోషల్‌మీడియా ద్వారానే భారీగా డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిసింది. శ్రీలీల ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 17 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ వేదికలో ఒక్క ప్రమోషనల్ పోస్ట్‌కు ఆమె 5 నుంచి 10 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా నెలరోజుల్లో దాదాపు 50 లక్షల వరకు ఈ భామ ఆర్జిస్తున్నదని ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. సోషల్‌మీడియాలో బ్రాండ్ కొలాబరేషన్స్ ద్వారా పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్న కథానాయికల్లో శ్రీలీల ఒకరని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. ట్రేడ్ వర్గాల్లో మాత్రం బాగా
ప్రచారమవుతున్నది.