లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘SR కళ్యాణమండపం’ ఓటీటీలో వచ్చేది ఎప్పుడో తెలుసా..?
SR కళ్యాణమండపం | ఓటిటి హవా కనిపిస్తున్న ఈ సమయంలో థియేటర్స్ లోకి వచ్చిన ఓ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుంది. ట్రేడ్ ను కూడా ఆశ్చర్యపరుస్తూ కరోనా సమయంలోనూ ఖతర్నాక్ కలెక్షన్స్ తీసుకొస్తుంది. అదే SR కళ్యాణమండపం.

చాలా రోజుల తర్వాత థియేటర్స్ లో కలెక్షన్స్ కురిపించిన సినిమా SR కళ్యాణమండపం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొన్నాళ్లుగా సినిమాలు విడుదల చేయలేదు. మరోవైపు సినిమాలు థియేటర్స్ లోనే చూడాలనే విషయం కూడా ఆడియన్స్ పూర్తిగా మరిచిపోయారు. ఓటీటీ హవా కనిపిస్తున్న ఈ సమయంలో థియేటర్స్ లోకి వచ్చిన ఓ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుంది. ట్రేడ్ ను కూడా ఆశ్చర్యపరుస్తూ కరోనా సమయంలోనూ ఖతర్నాక్ కలెక్షన్స్ తీసుకొస్తుంది. అదే SR కళ్యాణమండపం. ఈ సినిమా సెకండ్ వేవ్ తర్వాత తొలి క్లీన్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రం వారం రోజుల్లోనే 7 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసింది కిరణ్ అబ్బవరమే. పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన SR కళ్యాణమండపం సినిమాకు రొటీన్ గా ఉందనే టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి.. ఇంకా చెప్పాలంటే భారీగానే వచ్చాయి. ఈ సినిమా ఓటిటి విడుదల తేదీపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. SR కళ్యాణమండపం సినిమాను ఆహా కొనేసింది. మంచి రేట్ ఇచ్చి ఈ సినిమాను సొంతం చేసుకున్నారు ఆహా వాళ్లు.
ఆగస్ట్ 27న SR కళ్యాణమండపం సినిమాను స్ట్రీమ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. ఆగస్ట్ 27 అంటే సినిమా విడుదలైన 3 వారాలకు అన్నమాట. ‘కలర్ ఫోటో’, ‘క్రాక్’,’కుడి ఎడమైతే’, ‘నాంది’ లాంటి సినిమాలతో ఆహా మంచి ఫామ్ లో ఉంది. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన తొలి బ్లాక్ బస్టర్ SR కళ్యాణమండపం కూడా అక్కడే స్ట్రీమ్ కాబోతుండడం గమనార్హం. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

