Ramarao On Duty | ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి సొట్టల బుగ్గల్లో సాంగ్ విడుదల.. ఆకట్టుకుంటున్న ట్యూన్
sottala buggallo song released | మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా రవితేజ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే విడుదలైన ‘ఖిలాడీ’తో భారీ ఫ్లాప్‌ను అందుకున్న మాస్రాజ ఈ సారి ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాలని కసితో ఉన్నాడు. శరత్ మండవ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో చిత్ర బృందం తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని సోట్టబుగ్గల్లో పాటను మేకర్స్ విడుదల చేశారు.
మెలోడి సాంగ్‌గా విడుదలైన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. హరిప్రియా, నకుల్ అభ్యంకర్ ఆలపించిన ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించాడు. సామ్ సీఎస్ ట్యూన్ మంచి ఫీల్‌ను క్రియేట్ చేస్తుంది. ఇటీవలే విడుదలైన ‘బుల్ బుల్ తరంగ్’ పాటకు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా దివ్యాంక కౌశిక్, రజీషా విజయన్లు హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
‘కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకు అపార నష్టం’
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

