Bigg Boss Sonia Akula | బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల
Bigg Boss Sonia Akula | అందరూ అనుకున్నట్లుగానే బిగ్ బాస్ నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ అయింది. హౌస్మేట్స్ వేసిన ఓటింగ్‌తో సోనియాకు తక్కువ ఓట్లు పడగా.. హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పటికే ఈ హౌస్ నుంచి మొదటివారం బేబక్క ఎలిమినేషన్ అవ్వగా.. రెండోవారం శేఖర్ భాషా వెళ్లిపోయాడు.
Bigg Boss Sonia Akula | అందరూ అనుకున్నట్లుగానే బిగ్ బాస్ నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ అయింది. హౌస్మేట్స్ వేసిన ఓటింగ్‌తో సోనియాకు తక్కువ ఓట్లు పడగా.. హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పటికే ఈ హౌస్ నుంచి మొదటివారం బేబక్క ఎలిమినేషన్ అవ్వగా.. రెండోవారం శేఖర్ భాషా వెళ్లిపోయాడు. ఇక మూడో వారం అయితే ఎవరు ఉహించని విధంగా బిగ్ బాస్‌నే అభయ్ తిట్టడంతో అతడికి రెడ్ కార్డు ఇచ్చి నాగార్జున బయటకు పంపేశాడు.
అయితే రసవత్తరంగా సాగుతున్న ఈ షోలో అందరి దృష్టి ఈసారి నాలుగో వారం ఎలిమినేషన్ మీదా పడిన విషయం తెలిసిందే. ఒకవైపు కంటెస్టెంట్లు ఇచ్చిన టాస్క్‌లు చేయకపోతే హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి అని నాగార్జున షాక్ ఇవ్వడం మరోవైపు రేషన్ కోసం హౌస్ మేట్స్ పడే తిప్పలతో ఈ వారం గడిచిపోయింది.
అయితే అందరూ ఊహించినట్లుగానే ఈ వారం ఎలిమినేట్ అయ్యింది సోనియా ఆకుల. ఇప్పటికే సోనియా ఆట వలన విసిగిపోయిన ప్రేక్షకులు హౌస్ నుంచి సోనియాను పంపేయాలంటూ కామెంట్లు పెడుతున్న విషయం తెలిసిందే. ఓటింగ్‌లో కూడా ఆమెకు 05 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ఏ అన్ అఫీషియల్ పోల్ చూసినా కూడా.. సోనియానే లీస్ట్ ఉంటుంది. మిగిలిన కంటెస్టెంట్స్ కనీసం డబుల్ డిజిట్ ఓటింగ్ వస్తే.. సోనియా సింగిల్ డిజిట్ ఓట్లు పడ్డాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. ఆమెపై ఆడియన్స్‌లో ఎంత నెగిటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆదివారం జరిగిన ఎలిమినేషన్లో సోనియా ఆకుల,
నాగ మణికంఠ నామినేషన్స్‌లో ఉండగా.. ఎవరిని ఇంటి నుంచి బయటకు పంపించాలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నే చెప్పమని నాగార్జున అడిగాడు.
ఇందులో నిఖిల్, పృథ్వీ, నైనిక సోనియాకు ఓట్ వేయగా మిగతా వాళ్ళు అంతా నాగ మణికంఠకు సపోర్ట్ చేసారు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన సోనియా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే నామినేషన్లో మణికంఠను కొన్నిరోజులు జైలులో ఉండాలని చెప్పాడు నాగార్జున. మరోవైపు ఈ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండే అవకాశం ఉందని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

