Shruti Haasan | మీరు సింగిలా..? అభిమాని ప్రశ్నకు శృతిహాసన్ రియాక్షన్ ఇదే
Shruti Haasan | చెన్నై సోయగం శృతిహాసన్ తన ప్రేమబంధానికి గుడ్‌బై చెప్పింది. డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో ఈ భామ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు విడిపోయారని ముంబయి మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
Shruti Haasan | చెన్నై సోయగం శృతిహాసన్ తన ప్రేమబంధానికి గుడ్‌బై చెప్పింది. డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో ఈ భామ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు విడిపోయారని ముంబయి మీడియాలో ప్రచారం జరుగుతున్నది. తాజాగా తన బ్రేకప్ న్యూస్‌ను అభిమానులతో జరిపిన ఇన్స్టాగ్రామ్ చిట్‌చాట్ ద్వారా వెల్లడించింది. ‘మీరు సింగిలా? లేదా ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ‘నేను సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వను. కానీ సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా.
నేను ఇప్పుడు సింగిల్‌గా నా జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నా. ఇంతకు మించి ఇంకేం చెప్పను’ అని సమాధానమిచ్చింది. దీంతో తన బ్రేకప్ను శృతిహాసన్ అధికారికంగా కన్ఫర్మ్ చేసినట్లయిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కోవిడ్ సమయంలో శంతను హజారికాతో శృతిహాసన్ డేటింగ్ను మొదలుపెట్టింది. ఈ జంట ముంబయిలో ఒకే ఫ్లాట్‌లో సహజీవనం చేశారు.
ఇద్దరు కలిసి చేసిన ఫన్నీ వీడియోలను తరచుగా సోషల్‌మీడియా ద్వారా పంచుకునేవారు. నెలక్రితం వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారు. దాంతో ముంబయి మీడియాలో బ్రేకప్ వార్తలొచ్చాయి. శృతిహాసన్ తాజా చిట్‌చాట్‌తో అది నిజమని తేలిపోయింది. ప్రస్తుతం శృతిహాసన్ తెలుగులో ‘సలార్-2’ చిత్రంలో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

