సైకలాజికల్ థ్రిల్లర్ ‘అర్థం’
శ్రద్ధాదాస్, మాస్టర్ మహేంద్రన్, ఆమని, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అర్థం’. మినర్వా పిక్చర్స్ పతాకంపై మణికాంత్ తెల్లగూటి దర్శకత్వంలో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రద్ధాదాస్ మాట్లాడుతూ ‘సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో నేను మానసిక వైద్యురాలి పాత్రలో కనిపిస్తాను. నా కెరీర్లోనే విభిన్నమైన పాత్రను పోషించినందుకు ఆనందంగా ఉంది’ అని చెప్పింది. ‘థ్రిల్లర్ కథకు వినోదాన్ని మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. రాకేందుమౌళి మాటలు, పాటలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో మహిళా సాధికారత, మానవ సంబంధాల గురించి చర్చించాం. వీఎఫ్ఎక్స్కు కూడా ప్రాధాన్యత ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పవన్ చెన్నా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

