కథానాయిక శ్రద్ధాదాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్థం’. మహేంద్ర, అజయ్, ఆమని, సాహితీ అవంచ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మణికాంత్ తెల్లగూటి దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్న డ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి రాధికా శ్రీనివాస్ నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు దేవా కట్టా విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారితను పెంపొందించే అంశాలకు వినోదాన్ని మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నాం. వీఎఫ్ఎక్స్లో నాకున్న అనుభవంతో వీఎఫ్ఎక్స్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నాను’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు: రాకేందు మౌళి, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, అసోసియేట్ నిర్మాతలు: పవన్ జానీ, వెంకట రమేష్.