అన్నయ్య పానంలో పూసిన పువ్వులు ..
శర్వానంద్ ‘భోగి’ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘ఎగిలివారంగా లేసి..ఇల్లలికి పూదిచ్చి’ అనే పాటకు సంగీత ప్రియుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అచ్చ తెలంగాణ మాండలికంలో చంద్రబోస్ రాసిన ఈ పాటలో గ్రామీణ జీవితాన్ని, కులవృత్తుల నేపథ్యాన్ని కళ్లకుకట్టారు. దసరా పర్వదినం సందర్భంగా ఈ సినిమా నుంచి రెండో గీతాన్ని విడుదల చేశారు. ‘అన్నయ్య పానం’ అంటూ సాగే ఈ పాటలో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని, ఆప్యాయతలను హృద్యంగా ఆవిష్కరించారు.

‘అన్నయ్య పానంలో పూసిన పువ్వులు ఐదుగురు చెల్లెళ్లంట. ఆ చిట్టి చెల్లెళ్ల పంచప్రాణాలు అన్నయ్య ఒకడేనంట’ అంటూ అన్నయ్య తాలూకు నిస్వార్థమైన ప్రేమకు అద్దం పట్టిందీ పాట. చంద్రబోస్ రచించిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. 1960 దశకం ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్య కథాంశంతో ‘భోగి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కేకే రాధామోహన్ నిర్మాత. త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి తదితరులు చిత్ర ప్రధాన తారాగణం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!