Aadi Saikumar | ఆదిసాయికుమార్, అవికాగోర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తున్నారు. తులసీరామ్, షణ్ముగం, రమేష్ యాదవ్ నిర్మాతలు. ఈ చిత్ర టైటిల్ లోగోను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘ఈ టైటిల్లో పాజిటివ్ వైబ్ ఉంది.
మా కథ నచ్చి రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్నందించడం ఆనందంగా ఉంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’ అన్నారు. ఇప్పటికే 70శాతం చిత్రీకరణ పూర్తయిందని, కథకు ఈ టైటిల్ పక్కాగా కుదిరిందని దర్శకుడు షణ్ముగం సాప్పని తెలిపారు. రవి బస్రూర్ సంగీతంతో పాటు విజువల్స్ సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తాయని నిర్మాతలు పేర్కొన్నారు.