సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర టీజర్‌ను గురువారం సాయిధరమ్‌తేజ్ విడుదల చేశారు. సత్యదేవ్ వాయిస్ ఓవర్‌తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. ‘ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు..’ అనే సంభాషణ ఆకట్టుకుంది.
‘ముగ్గురి స్నేహితుల కథ ఇది. ఓ చిన్న సంఘటన వారి జీవితాల్ని ఎలా మలుపు తిప్పిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. సత్యదేవ్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది’ అని చిత్రబృందం పేర్కొంది. కాలభైరవ సంగీతాన్నందించిన ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.