సారా అలీ ఖాన్‌తో కలిసి గంజాయి పీల్చా: రియా చక్రవర్తి

ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియాను గతంలో అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే చార్జ్‌షీట్‌లో ఆమె చెప్పిన వాస్తవాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. సుశాంత్‌కు మాదకద్రవ్యాలు అలవాటు ఉన్నట్లు గతంలో చెప్పిన రియా.. ఇప్పుడు మరో నటి సారా అలీ ఖాన్ కూడా ఇందులో భాగమైనట్లు వెల్లడించింది. సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ కూతురైన సారా అలీ ఖాన్.. సుశాంత్‌తో కలిసి కేదార్నాథ్ సినిమాలో నటించింది. అయితే సారాతో తనకు పరిచయం ఉన్నట్లు రియా తన చార్జ్‌షీట్‌లో చెప్పింది. సారా తనకు గంజాయితో పాటు వోడ్కాను కూడా ఆఫర్ చేసినట్లు రియా తన వాంగ్మూలంలో వెల్లడించింది. సుశాంత్ మృతి కేసులో తీసుకున్న స్టేట్మెంట్లో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. 2017 జూన్ 4వ తేదీన సారాతో చాటింగ్ చేశానని, చేతి చుట్టే గంజాయి చుట్టలు సారా వద్దే ఉండేవని, వాటిని తాను కూడా వాడినట్లు రియా చెప్పింది. సారా తనకు వోడ్కా కూడా ఇచ్చినట్లు రియా పేర్కొన్నది.
గత ఏడాది సుశాంత్ మృతి కేసులో నటి సారాను కూడా ఎన్సీబీ విచారించింది. కొంత కాలం సుశాంత్‌తో డేటింగ్ చేసినట్లు సారా అంగీకరించింది. థాయిల్యాండ్‌కు ట్రిప్ కూడా వెళ్లినట్లు ఆమె చెప్పుకొచ్చింది. సుశాంత్‌లో లివిన్ రిలేషన్షిప్లో ఉన్న రియా.. హీరో చావడానికి కొన్ని రోజుల ముందు అతన్ని విడిచి వెళ్లింది. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఆమెను 28 రోజుల పాటు అరెస్టు చేసింది. సుశాంత్ అకౌంట్ నుంచి డబ్బులు మాయమైన కేసులో ఈడీ దర్యాప్తు చేపడుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

