సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్’. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకాలపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. తాజాగా సినిమా ట్రైలర్‌ను స్టార్ హీరో ప్రభాస్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ…‘ఇదొక బ్యూటిఫుల్ మూవీ. నాన్ స్టాప్ నవ్వులు ఉంటాయి. సాహసాలతో సాగే థ్రిల్లర్ కథను ఇందులో చూస్తారు. హీరో హీరోయిన్లు ట్రావెల్ వ్లోగర్స్ పాత్రల్లో కనిపిస్తారు. హీరో పాత్రకు సంతోష్ శోభన్ పర్పెక్ట్గా సరిపోయారు.’ అన్నారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ…‘కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. మిమ్మల్ని ఆద్యంతం అలరిస్తుంది’ అన్నారు.