Santosh Sobhan | ‘నా లైఫ్‌లో ఎలాగో కలర్ లేదు.. మీరైనా రకరకాల రంగులతో పండగ చేస్కోండి’
విభిన్న కథలను ఎంచుకుంటూ తన శైలి నటనతో ప్రేక్షకులను ఆకట్టకుంటున్న నటుడు సంతోష్ శోభన్. వర్షం, బాబీ సినిమాల దర్శకుడు శోభన్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.
Santhosh Sobhan | విభిన్న కథలను ఎంచుకుంటూ తన శైలి నటనతో ప్రేక్షకులను ఆకట్టకుంటున్న నటుడు సంతోష్ శోభన్. వర్షం, బాబీ సినిమాల దర్శకుడు శోభన్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ‘గోల్కొండ హై స్కూల్’ చిత్రంతో గౌతమ్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సంతోష్ ‘పేపర్ బాయ్’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. కరోనా సమయంలో వచ్చిన ‘ఏక్ మినీ కథ’ చిత్రంతో మెదటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించాడు. తాజాగా ఈయన మారుతి దర్శకత్వంలో ‘మంచి రోజులువచ్చాయి’ సినిమాలో నటించాడు. కానీ అది బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘ప్రేమ్ కుమార్’.
అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు,గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. హోలీ సందర్భంగా మేకర్స్ ఓ ఆసక్తికరమైన కార్టూన్ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్లో సంతోష్ పెళ్ళి కొడుకు గెటప్‌లో ఒక చేతిలో తాళి పట్టుకుని మరోక చేతిలో భూతద్దం పట్టుకుని కనిపిస్తున్నాడు. ‘నా లైఫ్‌లో ఎలాగో కలర్ లేదు.. మీరైనా రకరకాల రంగులతో పండగ చేస్కోండి’ అంటూ ఉన్న పోస్టర్ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంతోష్ పెళ్ళి అవడంలేదని సతమతమయ్యే చింత పిక్కల ప్రేమ్ కమార్ అనే పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.
రంగులతో ఆడుకుంటున్నారా!!
ఇక్కడ #PremKumar గాడి జీవితం తో ఆడుకుంటున్నారు. పర్లేదు మీరు ఎంజాయ్ చెయ్యండి 💥Happy Holi everyone!🖍️
@santoshshobhan @abhimaharshi1 @shiva6111 @SharangaOffl @Rashisreal @ruchitasadineni @garrybh88 @anerudhp @cerebrahma @GaddeAjay @adityamusic pic.twitter.com/FRfNIBWuxh
— BA Raju's Team (@baraju_SuperHit) March 18, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

