Sundeep Kishan | ‘ఊరిపేరు భైరవకోన’ చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నారు హీరో సందీప్‌కిషన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘వైబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. శనివారం టైటిల్ ప్రకటనతో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో సందీప్‌కిషన్ యాక్షన్ అవతారంలో కనిపిస్తున్నారు. చేతిలో హాకీ స్టిక్స్ పట్టుకున్న మిత్రబృందం పోరాటానికి సిద్ధమన్నట్లుగా కనిపిస్తున్నారు. ‘కాలేజ్ బేస్డ్ యాక్షన్ లవ్‌స్టోరీ ఇది. ఓ సాధారణ స్నేహితులు వ్యవస్థను ఎదిరించే రెబల్స్‌గా మారే వైనం ఆసక్తిని కలిగిస్తుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది.