ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇటీవలే సెబాస్టియన్ పీసీ 524 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా..ఈ సినిమా బాక్సాపీస్ వద్ద మంచి డీలా పడిపోయింది. ఈ కుర్ర హీరో ఇపుడు సమ్మతమే (Sammathame) సినిమాతో అందరినీ పలుకరించేందుకు రెడీ అవుతున్నాడు. కలర్ ఫొటో ఫేం చాందినీ చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. డెబ్యూట్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి (Gopinath Reddy) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ఫైనల్ చేశారు మేకర్స్.
2022 జూన్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజర్‌గా వ్యవహరిస్తున్నాడు. చాందినీ చౌదరి మరోవైపు గామి చిత్రంలో నటిస్తోండగా..ఇది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
మరోవైపు కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు చేస్తున్నాడు. సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న కిరణ్ అబ్బవరానికి ఈసారైనా హిట్టు పడేనా..? అంటూ తెగ చర్చిస్తున్నారు సినీ జనాలు.