Samantha | సూర్యాస్తమయ వేళ గుర్రపు స్వారీ చేస్తున్న సమంత..
అగ్ర కథానాయిక సమంత అనారోగ్యం కారణంగా కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆమె కొన్ని వారాలుగా గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 28న సమంత ఇన్స్టాగ్రామ్ పేజీలో తాను గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను షేర్ చేశారు.
Samantha | అగ్ర కథానాయిక సమంత అనారోగ్యం కారణంగా కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆమె కొన్ని వారాలుగా గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 28న సమంత ఇన్స్టాగ్రామ్ పేజీలో తాను గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు అన్ని సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారింది.
ఆహ్లాదకరమైన వాతావరణంలో సూర్యాస్తమయ సమయంలో ఆమె గుర్రంపై స్వారీ చేస్తున్న దృశ్యం చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నది. అయితే తన తదుపరి ప్రాజెక్టు కోసం గుర్రపు స్వారీ చేయడంలో పాఠాలు నేర్చుకుంటున్నారా..? అభిరుచి కోసమా అనేదిప్పుడు రహస్యమే. ప్రస్తుతానికైతే రాబోయే ప్రాజెక్టును సమంత ప్రకటించలేరు.

నటనకు కొంత విరామం ఇచ్చిన ఆమె పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. మోయోసైటిస్తో బాధపడుతున్న సమంత దాని నుంచి వీలైనంత త్వరగా కోలుకోవడంపై దృష్టి సారించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఖుషి’లో సమంత హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటించారు. రాజ్, డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆంథోనీ రస్సో నిర్మించిన ఈ యాక్షన్ సిరీస్‌లో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రలు
పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

