The Soul Of Satya | దేశభక్తి ఉప్పొంగేలా సాయిధరమ్ తేజ్, స్వాతిరెడ్డి The Soul Of Satya సాంగ్
The Soul Of Satya | సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej), స్వాతిరెడ్డి (Swathi Reddy) కాంబోలో తెరకెక్కిన మ్యూజికల్ వీడియో సత్య (Satya). ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేశారు.
The Soul Of Satya Promo | సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej), స్వాతిరెడ్డి (Swathi Reddy) కాంబోలో తెరకెక్కిన మ్యూజికల్ వీడియో సత్య (Satya). The Soul Of Satya టైటిల్‌తో సాంగ్ ప్రోమోను విడుదల చేయగా.. మంచి స్పందన వచ్చింది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ పాటను శృతిరంజని రాసి తానే స్వయంగా కంపోజ్ చేస్తూ పాడింది.
దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి.. సరైన గుర్తింపునకు నోచుకోని రియల్ హీరోలకు నివాళిగా మ్యూజిక్ వీడియో రూపొందించారు. అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది.. నేను మహరాణినని.. నన్ను ఒక రోజు ఒక మహారాజు వచ్చి తీసుకెళ్తాడని.. అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో మొదలైంది సాంగ్. పెళ్లయిన తర్వాత విధులు నిర్వర్తించేందుకు సరిహద్దులకు వెళ్లే జవాన్‌గా కనిపిస్తున్నాడు సాయిధరమ్ తేజ్. దేశం కోసం తమ ప్రేమను త్యాగం చేసి.. దేశానికి ఎంతోమంది యుద్దవీరులను అందించిన మహిళల త్యాగాలను స్మరించుకుంటూ రూపొందించిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ మ్యూజిక్ వీడియోను సాయిధరమ్ తేజ్ స్నేహితుడు నవీన్ విజయ్ కృష్ణ (యాక్టర్) డైరెక్ట్ చేయడం విశేషం. గతేడాది పంచతంత్రం అంథాలజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది స్వాతిరెడ్డి. ప్రస్తుతం Idiots, Month Of Madhu ప్రాజెక్ట్‌ల్లో నటిస్తుండగా.. షూటింగ్ పూర్తయింది.
The Soul Of Satya ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
The Soul Of Satya Promo..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

