RX 100 | ‘ఆర్ఎక్స్ 100’ కాంబో రిపీట్.. ఈసారి సీమ యాక్షన్ డ్రామా !
RX 100 | కార్తికేయ హీరోగా తెరకెక్కిన ‘ఆర్ఎక్స్ 100’ (RX 100) ఒక సంచలనమైన విజయాన్ని సాధించింది. దర్శకుడిగా అజయ్ భూపతి (Ajaybhupathi)కిదే తొలి చిత్రం. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ దాదాపు ఈ సినిమాలో నటించిన అందరికీ ఫేం తీసుకొచ్చింది.
RX 100 | ‘ఆర్ఎక్స్ 100’ (RX 100) టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్ చేసిన చిత్రం. కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఒక సంచలనమైన విజయాన్ని సాధించింది. దర్శకుడిగా అజయ్ భూపతి (Ajaybhupathi)కిదే తొలి చిత్రం. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శిష్యుడైన అజయ్ తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ దాదాపు ఈ సినిమాలో నటించిన అందరికీ ఫేం తీసుకొచ్చింది. కార్తికేయకి వరుసగా సినిమాలు వచ్చాయి.
అయితే మళ్లీ ‘ఆర్ఎక్స్ 100’ తరహ విజయాన్ని అయితే అందుకోలేకపోయాడు కార్తికేయ (Karthikeya). కాగా ఇప్పుడీ కాంబినేషన్ మళ్లీ సెట్ కాబోతుందని తెలుస్తోంది. ఇటివలే మంగళవారంతో మరో వినూత్న ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అజయ్ భూపతి. ట్రైలర్ సినిమాపై చాలా ఆసక్తిని పెంచడంతో బిజినెస్ కూడా బాగానే జరిగింది. టేబుల్ ఫ్రాఫిట్ తో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద బాగానే వర్క్ అవుట్ అయ్యింది.
మహాసముద్రం లాంటి ఫ్లాఫ్ తర్వాత మంగళవారం ఫలితం అజయ్ మంచి బూస్ట్ ఇచ్చింది. ఇప్పుడు కార్తికేయతో మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు అజయ్. ఈసారి రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఓ యాక్షన్ డ్రామాని సెట్ చేశాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు బయటికి వస్తాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
Harish Rao | గ్రావిటీతో నీళ్లా.. నిరూపిస్తే రాజీనామా? లేదంటే మీరు చేస్తారా ?.. సర్కార్‌కు హరీశ్ ఓపెన్ చాలెంజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

