త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా?
మెగాస్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలన్నది మెగాభిమానుల చిరకాల కోరిక.
మెగాస్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలన్నది మెగాభిమానుల చిరకాల కోరిక. ఈ అరుదైన కలయిక కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ త్రివిక్రమ్‌తో సినిమా కోసం చాన్నాళ్ల క్రితమే ఒప్పందం చేసుకుందని, ఇప్పుడా కమిట్మెంట్ను ఉపయోగించి చిరు-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్.
అయితే ఈ సినిమా పట్టాలెక్కడం అంత సులభం కాదని, అందుకు చాలా అంశాలు అనుకూలించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. ఒకవేళ చిరంజీవితో సినిమా చర్చలు ముందుకుసాగితే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే చిరు-త్రివిక్రమ్ కాంబో తాలూకు వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనా? ఇందులో ఏమైనా వాస్తవం ఉందా అనే విషయాల్లో స్పష్టత రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

