Rakesh Sashii | కథ డిమాండ్ మేరకే రొమాంటిన్ సీన్లు.. ఊర్వశివో రాక్షసివో డైరెక్టర్ రాకేశ్ శశి చిట్‌చాట్
రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఊర్వశివో రాక్షసివో (Urvashivo Rakshashivo) చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. నేపథ్యంలో రాకేశ్ శశి మీడియాతో చిట్ చాట్ చేశాడు. సినిమా విశేషాలు డైరెక్టర్ మాటల్లోనే..
అల్లు శిరీష్ (Allu Sirish)-అను ఇమ్మాన్యుయేల్ కాంబినేషన్లో వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఊర్వశివో రాక్షసివో (Urvashivo Rakshashivo). రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానున్న నేపథ్యంలో రాకేశ్ శశి మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఊర్వశివో రాక్షసివో చిత్రాన్ని కుటుంబసమేతంగా చూసి, ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుందని అంటున్నాడు రాకేశ్ శశి. సినిమా విశేషాలు డైరెక్టర్ మాటల్లోనే..
ఊర్వశివో రాక్షసివో సినిమా గురించి..
ప్రస్తుత సమాజంలో యువత ఐడియాలజీ, ప్రవర్తన లాంటి అంశాల నేపథ్యంలో కథ ఉంటుంది. ఈ విషయాన్ని చాలా వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాం. ఫ్యామిలీ ఆడియెన్స్‌తోపాటు ప్రతీ ఒక్కరూ నిస్సందేహంగా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు.
సినిమాలో రొమాంటిక్ సీన్ల డోస్ పెరిగినట్టుంది..?
కథ డిమాండ్‌కు అనుగుణంగా రొమాంటిక్ సీన్లు పెట్టాం. సినిమాలో ఎలాంటి అసభ్యతకు (వల్గారిటీ) ఛాన్స్ ఉండదని గ్యారంటీ ఇవ్వగలను. సినిమా ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
అల్లు శిరీష్‌తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది..?
చాలా ఏండ్లుగా మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అల్లు శిరీష్ ఈ సినిమా కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు. బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా రిహార్సల్స్ కూడా చేశాడు. ఆఫ్ స్క్రీన్‌లో అల్లు శిరీష్ మంచి స్నేహితుడే కాదు..
అనూ ఎమ్మాన్యుయేల్ గురించి..?
ఈ కథ గురించి ఆలోచించిన వెంటనే నా మొదటి ఛాయిస్ ఆమెనే. ఈ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్‌కు ఆమె అయితేనే సరైన న్యాయం చేస్తుందని బలంగా నమ్మాను. అనూ ఎమ్మాన్యుయేల్ కు ప్రత్యేక శైలి, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సినిమాలో ఆమెను చూసిన ప్రతీ ఒక్కరూ ప్రేమలో పడతారు.
అల్లు అరవింద్‌తో పనిచేయడం ఎలా ఉంది..?
కథ మొదలైనప్పటి నుంచి అల్లు అరవింద్ సార్ చాలా సపోర్ట్ చేశారు. నేను గతంలో చేసిన విజేత సినిమాను అభినందించిన తొలి నిర్మాత ఆయనే. తర్వాత ఈ సినిమాకు అవకాశం ఇచ్చారు. బన్నీ వాసు సినిమాకు ఏం కావాలని అడిగితే అది ఇచ్చారు. ఆయనిప్పుడు నాకు మంచి స్నేహితుడయ్యాడు.
కొత్త సినిమాల అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా..?
ప్రస్తుతానికి కొత్తగా ఏ సినిమాను ఒకే చేయలేదు. రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో మరో సినిమా చేసే అవకాశముంది. వివరాలు తర్వాత వెల్లడిస్తా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

