Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
Rocking Star Yash | ఫిలిం నగర్లో ప్రస్తుతం ఓ సరికొత్త చర్చ జోరుగా సాగుతోంది. మంచు మనోజ్ హీరోగా బ్రిటిష్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'డేవిడ్ రెడ్డి'.
Rocking Star Yash | ఫిలిం నగర్లో ప్రస్తుతం ఓ సరికొత్త చర్చ జోరుగా సాగుతోంది. మంచు మనోజ్ హీరోగా బ్రిటిష్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న యువ దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అతడి తొలి సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే, ఆయన పేరు కన్నడ రాకింగ్ స్టార్, పాన్-ఇండియా స్టార్ యష్‌తో ముడిపడి వినిపిస్తుండటం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
హనుమ రెడ్డి కథకు యష్ టీమ్ ఫిదా అయినట్లు తెలుస్తుంది. ‘కేజీఎఫ్’ ‘టాక్సిక్’ వంటి భారీ చిత్రాల తర్వాత యష్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల జాబితాలో హనుమ రెడ్డి సినిమా కూడా చేరిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం కొత్త దర్శకుడే అయినప్పటికీ, హనుమ రెడ్డి మొదటి సినిమాకే రవి బస్రూర్, ఆచార్య వేణు, సుప్రీమ్ సుందర్ వంటి టాలెంటెడ్ అగ్ర టెక్నీషియన్లను రంగంలోకి దించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ టెక్నికల్ వాల్యూస్, సినిమా టీజర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చూసే యష్ స్వయంగా ఈ దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ విపరీతమైన బజ్ కేవలం సినిమాపై ఉన్న హైప్ కారణంగా పుట్టుకొచ్చిన గాసిప్ మాత్రమేనని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, దర్శకుడి విజన్ చూస్తుంటే కచ్చితంగా ఇది నిజమయ్యే అవకాశాలున్నాయని మరికొందరు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై అటు యష్ క్యాంప్ నుంచి కానీ, ఇటు హనుమ రెడ్డి వైపు నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏది ఏమైనా, మంచు మనోజ్ లాంటి హీరోతో ‘డేవిడ్ రెడ్డి’ ద్వారా ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధమవుతున్న హనుమ రెడ్డికి, రాబోయే రోజుల్లో ఏకంగా రాష్ట్రాలు దాటి పాన్-ఇండియా రేంజ్లో బిగ్ ఆఫర్స్ వస్తుండటం మాత్రం తెలుగు సినిమా రంగంలో సంచలనంగా మారింది. అసలు ఈ రూమర్ వెనుక నిజమెంత ఉందనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

