కొత్త జేమ్స్‌బాండ్ వచ్చాడు
ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన గూఢచారి పాత్రల్లో జేమ్స్‌బాండ్ ఒకటి. ైస్టెలిష్ లుక్స్, ఖరీదైన కార్లు, అత్యాధునిక ఆయుధాలు, సాహసోపేతమైన ఆపరేషన్స్, అందమైన కథానాయికలు..ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఆరు దశాబ్దాలుగా సినీ ప్రియుల్ని అలరిస్తున్నారు జేమ్స్‌బాండ్.
ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన గూఢచారి పాత్రల్లో జేమ్స్‌బాండ్ ఒకటి. ైస్టెలిష్ లుక్స్, ఖరీదైన కార్లు, అత్యాధునిక ఆయుధాలు, సాహసోపేతమైన ఆపరేషన్స్, అందమైన కథానాయికలు..ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఆరు దశాబ్దాలుగా సినీ ప్రియుల్ని అలరిస్తున్నారు జేమ్స్‌బాండ్. 1962లో వచ్చిన ‘డాక్టర్ నో’ చిత్రంతో జేమ్స్‌బాండ్ వెండితెర ప్రయాణం మొదలైంది. ఆ సినిమాతో సీన్ కానరీ జేమ్స్‌బాండ్‌గా పరిచయమయ్యారు. ఇప్పటివరకు ఆరుగురు హీరోలు ఈ జేమ్స్‌బాండ్ పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పించారు. డేనియల్ క్రెయిగ్ తర్వాత జేమ్స్‌బాండ్ పాత్రను పోషించే నటుడెవరని ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన స్థానంలో రాబర్ట్ ప్యాటిన్సన్ను కొత్త జేమ్స్‌బాండ్‌గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. సోషల్‌మీడియాలో విడుదల చేసిన ప్రత్యేక వీడియో ద్వారా రాబర్ట్ ప్యాటిన్సన్ను కొత్త జేమ్స్‌బాండ్ 007గా పరిచయం చేశారు. హ్యారీ పాటర్, ట్విలైట్, టెనెట్, ది బ్యాట్‌మ్యాన్, ది లైట్‌హౌస్ వంటి చిత్రాలతో ప్రతిభావంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు రాబర్ట్ ప్యాటిన్సన్.
తదుపరి చిత్రానికి సన్నాహాలు
2021లో విడుదలైన ‘నో టైమ్ టు డై’ చిత్రంతో డేనియల్ క్రెయిగ్ జేమ్స్‌బాండ్ పాత్రకు వీడ్కోలు పలికారు. అప్పటి నుంచి తదుపరి జేమ్స్‌బాండ్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. చివరకు రాబర్ట్ ప్యాటిన్సన్ను ఎంపిక చేశారు. ఇక తదుపరి జేమ్స్‌బాండ్ చిత్రానికి డ్యూన్, బ్లేడ్ రన్నర్ వంటి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న డెనిస్ విల్లెన్యూవ్ దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

