పవన్ కల్యాణ్ కి పాజిటివ్ అనితేలడంతో వివాదా దర్శకుడు వర్మ రకరకాల కామెంట్లతో పీకె ఫ్యాన్స్ ని రెచ్చగొట్టారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ లు వైరల్ కావడంతో తనదైన స్టైల్లో స్పందించారు. మేము సినిమా వాళ్లం కాబట్టి జనాన్ని ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పవన్ పై అలా ట్వీట్స్ పెట్టాను తప్ప వేరే ఉద్దేశ్యం ఏదీ లేదన్నారు.
పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలు అటు సినిమాలు చేస్తున్నారు. అయితే గాంధీ గారి టైమ్ నుంచే పొలిటిషన్స్ ఎవరైనా హాస్పిటల్లో ఉంటే ప్రజల నుంచి సానుభూతి వస్తుంది. అదే పవన్ కళ్యాణ్ కూడా కంటిన్యూ చేశారని నాకు అనిపించింది. కాకపోతే పవన్ ఫ్యాన్ గా ఆయన బెడ్‌పై నీరసంగా పడుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ స్టార్ హీరో వైరస్ ని పట్టి తన్నేయాలి కానీ అలా పడుకోవడమేంటి? అందుకే ఆవేదనతో అలా ట్వీట్ చేశా అని ఆర్జీవీ చెప్పారు.
వకీల్ సాబ్ కలెక్షన్స్, దగుల్బాజీ ఫ్యాన్స్ అనడంపై రియాక్ట్ అవుతూ.. వేరే హీరో ఫ్యాన్స్ అలా అంటున్నారు కాబట్టి దానిపై నా స్పందన తెలిపాను తప్ప ఇంకోటి లేదని ఆయన అన్నారు.
తిరుపతి ఎన్నికల సందర్బంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేసిన ఆడియోకి కౌంటర్ ఇస్తానంటున్నాడు వివాదాల వర్మ. రెండుమూడురోజుల్లో తన గొంతుతో ఉండే ఆడియోని రిలీజ్ చేయబోతున్నట్లు ఓ ఇంటర్వూలో తెలిపారు. పవర్‌స్టార్ కి తనకంటే పెద్ద ఫ్యాన్ ఈ భూ ప్రపంచంలో లేడన్నాడు. పవన్ దేవుడని, తాను భక్తుడిని అని చెబుతూ సెటైర్స్ వేశారు వర్మ.