Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
RGV | బాలీవుడ్ యువ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
RGV | బాలీవుడ్ యువ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముంబైలోని జుహు ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాలతో బయటపడగా, డ్రైవర్‌తో పాటు మరో ఆటో డ్రైవర్ గాయపడ్డారు. అయితే ఈ ఉదంతంపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన నిందితులను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. సినిమాల్లో అయితే కనీసం విలన్ల అడ్డాలో టీ పోసే కుర్రాళ్ల పాత్రలకు కూడా వీళ్లను ఎంపిక చేయరు. ఒకవేళ దేశంలోని అత్యంత భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌పై సినిమా తీస్తే.. ఎవరూ కూడా అచ్చం దావూద్ ఇబ్రహీంలా కనిపించే వ్యక్తిని ఆ పాత్రకు తీసుకోరు. కానీ, రీల్ లైఫ్ కాస్టింగ్ డైరెక్టర్లతో పోలిస్తే.. రియల్ లైఫ్ క్యాస్టింగ్ డైరెక్టర్ చాలా విచిత్రంగా ఉంటారు అంటూ ఆర్జీవీ ఎద్దేవా చేశారు. సినిమాల్లో విలన్లను ఎంపిక చేసే తీరుకు, నిజ జీవితంలో నేరాలకు పాల్పడేవారి రూపాలకు ఉండే వ్యత్యాసాన్ని ఆయన ఈ విధంగా చురకలంటిస్తూ వివరించారు.
The way the shooters of @iTIGERSHROFF looked like , in a film they wouldn’t be cast even as tea supplying boys in a villains den … Come to think of it , if one makes a film on India’s most dreaded gangster , no one will cast a guy who looks like Dawood Ibrahim .. Real life casting director is very strange compared to reel life casting director @CastingChhabra 😳
— Ram Gopal Varma (@RGVzoomin) October 23, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

