శ్రీవిద్యమహర్షి, దివ్యశ్రీపాద, సునీల్, చాందినీరావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హెడ్స్ అండ్ టేల్స్’. సాయికృష్ణ ఎన్రెడ్డి దర్శకుడు. ‘జీ 5’ ఓటీటీ యాప్ ద్వారా ఈ నెల 22న ఈ చిత్రం విడుదలకానుంది. ఫస్ట్‌లుక్‌ను హీరోయిన్ రెజీనా విడుదలచేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘ముగ్గురు మహిళల జీవితాల నేపథ్యంలో సాగే అందమైన కథ ఇది. విధి కారణంగా ఒక్క రాత్రిలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. తమ కోసం, తమ హక్కుల కోసం మహిళలు పోరాడాలని చాటిచెప్పేలా స్ఫూర్తిదాయకంగా సందీప్‌రాజ్ ఈ కథను రాశారు. ఇందులో మానవుల తలరాతలు రాసే దేవుడిగా సునీల్ కనిపిస్తారు’ అని తెలిపారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమిదని జీ5ప్రతినిధులు పేర్కొన్నారు.