కార్తిక్ జయంతి, శ్రీషా నూలు జంటగా నటిస్తున్న చిత్రం ‘రాయవలస’. ‘లవ్ టైడ్ బై ఫేట్’ ఉపశీర్షిక. రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గోపీకృష్ణ జే నిర్మాత. శనివారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. గ్రామీణ నేపథ్య కథాంశమిదని, ఓ రైస్‌మిల్ యజమాని రాజు ప్రేమకథగా ఆకట్టుకుంటుందని దర్శకురాలు రాధిక జయంతి తెలిపారు. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, మనసుల్ని కదిలించే ప్రేమకథ ఇదని నిర్మాత పేర్కొన్నారు. అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వీఆర్కే నాయుడు, సంగీతం: అర్జున్ బాలా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాధిక జయంతి.