మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘శాకిని డాకిని’ ఫేం సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, అనూ ఇమ్మాన్యూయేల్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అక్కినేని సుశాంత్ విలన్‌గా అలరించనున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ , గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ”రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ‘రావణాసుర’ నుంచి కొత్త అప్‌ఢేట్ ఉంది స్టే ట్యూన్డ్” అంటూ మేకర్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఆ అప్డేట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.
కాగా ఈ ఏడాది మాస్ మహారాజ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో అదరగొడుతున్నాడు. ‘ధమకా’, ‘వాల్తేరు వీరయ్య’తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన రవితేజ ఇదే ఫ్లో ని తన నెక్స్ట్ ఇంటెన్స్ థ్రిల్లర్ చిత్రం “రావణాసుర” తో కూడా కంటిన్యూ చెయ్యాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
#Ravanasura Update Tomorrow 10.08 a.m stay tuned ❤️❤️❤️
— ABHISHEK PICTURES (@AbhishekPicture) February 12, 2023