Ramarao On Duty Pre-Release Business | ‘క్రాక్’ చిత్రంతో రవితేజ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. 50% ఆక్యూపెన్సీతో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్ళను సాధించి రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ‘ఖిలాడీ’ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు రూ.24కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఈ చిత్రం సగం బడ్జెట్‌ను కూడా రికవరీ చేయలేకపోయింది. దీంతో ఆ ఎఫెక్ట్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ థియేట్రికల్ బిజినెస్‌పై పడినట్లు టాక్.
ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.17.20 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం రూ.18కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ చూస్తే టార్గెట్ తక్కువే. సినిమాకు గనుక హిట్ టాక్ వస్తే వారంలోపే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత వేణు తొట్టెంపూడీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా దివ్యాంక కౌశిక్, రజీషా విజయన్లు కథానాయికలుగా నటించారు. శరత్ మండవ దర్శకుడిగా పరిచయవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది.