Manchu Manoj | టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వడ్డీ కాసులవాడ’. తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎకే ఎంటర్టైన్మెంట్స్, ఏటీవీ ఒరిజినల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్డేట్ను విడుదల చేశారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న జయరవి బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను పంచుకున్నారు.
ప్రతి ఒక్కరి హృదయాల్లో కొలువై ఉండే శ్రీ గోవిందుడి (శ్రీనివాసుడి) దివ్య పాత్రలో నటిస్తున్న రవిమోహన్‌కు చిత్ర యూనిట్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లోకి ఆయనను స్వాగతించడం చాలా సంతోషంగా ఉందని మేకర్స్ పేర్కొంటూ ‘ఓం నమో వేంకటేశాయ’ అంటూ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆర్ట్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే కో-ప్రొడ్యూసర్లుగా దయా పన్నెం, అజయ్ సుంకర, కిషోర్ గరికపాటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్-ఇండియా చిత్రంపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Happiest Birthday to our beloved @iam_RaviMohan ✨
Blessed to welcome you on board #VaddiKaasulaVaada in the divine role of Lord Govinda who resides in every heart ❤️
Excited for this special journey ahead. Om Namo Venkatesaya 🙏@HeroManoj1 @tej_uppalapati @AnilSunkara1… pic.twitter.com/ch5cQruA2a
— AK Entertainments (@AKentsOfficial) September 10, 2026