Raveena Tandon | పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ‘కేజీఎఫ్-2’ రవీనా టాండన్
Raveena Tandon in Pawan Kalyan Movie | ప్రస్తుతం ఐపీఎల్‌కు మించి క్రేజ్‌తో కేజీఎఫ్-2 చిత్రానికి ఉంది. సినిమా విడుదలై పన్నెండు రోజులు అయినా ‘కేజీఎఫ్-2’ మేనియా ఏమాత్రం తగ్గలేదు. సౌత్ నుంచి నార్త్ వరకు ఎక్కడ చూసిన కేజీఎఫ్-2 హవానే నడుస్తుంది. ప్రశాంత్ నీల్ టేకింగ్, విజన్‌ను చూడడానికి ప్రేక్షకులు రిపీటెడ్‌గా వస్తున్నారు. యష్ నటన, అభినయానికి ప్రశంసలు జల్లులు కురుస్తున్నాయి. బాలీవుడ్లో తాజాగా ఈ చిత్రం 300కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలోని హీరోతో పాటుగా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టులు కూడా గొప్ప నటనను కనబరిచారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవల్సిన పేరు రవీనా టాండన్.
కేజీఎఫ్-2 లో ప్రధాన మంత్రి పాత్రలో రమికా సెన్‌గా, రవీనా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. రవీనా తన నటనతో సినీప్రముఖులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం ఈమెకు సౌత్ నుంచి నార్త్ వరకు అవకాశాలు భారీగా వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలో రవీనాకు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భవదీయుడు భగత్‌సింగ్’. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించినుంది.
అయితే ఇటీవలే ‘కేజీఎఫ్-2’ చిత్రాన్ని వీక్షించిన హరీష్‌శంకర్ ప్రధాన మంత్రి పాత్రలో రిమికాసెన్గా ఒదిగిపోయిన తీరును చూసి భవదీయుడిలో ఓ కీలకపాత్ర కోసం సంప్రదించాడట. పాత్ర నచ్చడంతో రవీనా కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచిందట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సిఉంది. 1993లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘రథ సారధి’ చిత్రంతో రవీనా టాండన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘బంగారుబుల్లోడు’, ‘ఆకాశ వీధిలో’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

