Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
Rashmika | నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గురించి సోషల్ మీడియాలో ఇటీవల జరుగుతున్న చర్చ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి పాల్గొన్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో రష్మిక చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారితీశాయి. విజయ్ను పెళ్లి చేసుకోవడానికి తాను అతడికి వందసార్లు ప్రపోజ్ చేసినట్లు ఆమె సరదాగా చెప్పడంతో కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు.
Rashmika | నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గురించి సోషల్ మీడియాలో ఇటీవల జరుగుతున్న చర్చ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి పాల్గొన్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో రష్మిక చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారితీశాయి. విజయ్ను పెళ్లి చేసుకోవడానికి తాను అతడికి వందసార్లు ప్రపోజ్ చేసినట్లు ఆమె సరదాగా చెప్పడంతో కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రష్మిక సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టి తన అభిప్రాయాలను వెల్లడించారు. తమ బంధం గురించి అసలు విషయం ఏమిటో వివరించే ప్రయత్నం చేశారు.
తన గురించి, విజయ్ గురించి ఇంటర్నెట్లో జరుగుతున్న చర్చపై రష్మిక స్పందించారు. సాధారణంగా ఇలాంటి విషయాలపై తాను స్పందించనని, ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. ఇతరుల అభిప్రాయాలను చదివి, విషయాలను మరో కోణంలో అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తానని తెలిపారు. అయితే తమ ఇంటర్వ్యూపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ అభిప్రాయాల వ్యక్తీకరణలా కాకుండా, కోపాన్ని వెళ్లగక్కడానికి ఒకరిని లక్ష్యంగా చేసుకున్నట్లుగా అనిపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విషయం పక్కదారి పట్టిందని, తమ మాటలను కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
విజయ్‌కు వందసార్లు ప్రపోజ్ చేశానన్న వ్యాఖ్యపై వస్తున్న విమర్శలకు రష్మిక తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తమ బంధంలో ఎన్ని సార్లు ప్రపోజ్ చేశామన్నది, ఎంత సమయం తీసుకున్నామన్నది ముఖ్యమైన విషయం కాదని స్పష్టం చేశారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, తమ జీవితంలో కలిసి ముందుకు సాగాలనే నిర్ణయానికి రావడానికి తగినంత సమయం తీసుకున్నామని వివరించారు. పెళ్లి అంటే కేవలం ప్రపోజ్ చేయడం, మోకాళ్లపై కూర్చోవడం లేదా వేలికి ఉంగరం తొడగడం మాత్రమే కాదని రష్మిక పేర్కొన్నారు. కలిసి ఒక జీవితాన్ని, భవిష్యత్తును నిర్మించుకోవడమే తమకు ముఖ్యమని చెప్పారు. తనకు ఏం కావాలో నిర్ణయించుకునే హక్కు తనకు ఉన్నట్లే, విజయ్‌కు కూడా తన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉందని తెలిపారు.
విజయ్ను తాను ఎంతో ప్రేమిస్తున్నానని చెబుతూ, అవసరమైతే వందసార్లు కాదు.. వెయ్యిసార్లు కూడా ప్రపోజ్ చేస్తానని రష్మిక పేర్కొన్నారు. తన జీవితంలో విజయ్‌కు ఉన్న ప్రత్యేక స్థానాన్ని మరోసారి తెలియజేశారు. తనకు ఉచితంగా సలహాలు ఇస్తూ, తన గురించి ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్న వారికి కూడా రష్మిక సమాధానమిచ్చారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనకు అండగా నిలిచింది విజయ్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నానని, ఆ ఆనందం తన ముఖంలో, నటనలో, సినిమాల్లోనూ కనిపిస్తుందని తెలిపారు. తన జీవితం గురించి తాను చెప్పే మాటలను నమ్మకుండా, ఇంటర్నెట్లో ప్రచారమయ్యే కల్పిత కథనాలు, నకిలీ చిత్రాలు, అసత్య ప్రచారాలను కొందరు నమ్మడం బాధ కలిగిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- karan johar
- love
- Marriage
- Nani
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

