Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఓవర్సీస్లో డిజిటల్ రిలీజై భారీ వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ క్రేజీ మూవీ సెకండ్ పార్ట్ భారతీయ ప్రేక్షకులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. జూన్ 4వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ‘జియో హాట్‌స్టార్’ వేదికగా ‘ధురంధర్ 2’ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
అయితే ఈ నేపథ్యంలోనే భారతీయ ప్రేక్షకులకు మరో సర్ప్రైజ్ను ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా మొదటి భాగానికి సంబంధించిన అన్‌కట్ వెర్షన్‌ను (Dhurandhar Part 1 Uncut Version) డిజిటల్ వేదికలపైకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. మే 22 నుంచి నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ రెండింటిలోనూ ఒకే రోజున ఈ అన్‌కట్ వెర్షన్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది.