Rana – Miheeka | చాలా రోజుల తర్వాత దర్శనం ఇచ్చిన రానా-మిహికా జంట.. వెకేషన్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారుగా..!
Rana - Miheeka | టాలీవుడ్ ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత ప్రధాన పాత్రలో సినిమాలు చేస్తూనే సపోర్టింగ్ రోల్స్‌లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
Rana – Miheeka | టాలీవుడ్ ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత ప్రధాన పాత్రలో సినిమాలు చేస్తూనే సపోర్టింగ్ రోల్స్‌లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఓవైపు నిర్మాతగా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూనే తను కూడా పలు సినిమాలలో ప్రధాన పాత్రలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. అయితే రానా ఈ మధ్య సినిమాలలో కనిపించింది చాలా తక్కువ. షోలు కూడా చేసింది లేదు. సోషల్ మీడియాలో పలకరించింది కూడా చాలా తక్కువ. అయితే చాలా రోజుల తర్వాత రానా తన భార్య మిహికాతో కలిసి కనిపించడంతో పిక్స్ వైరల్ అవుతున్నాయి.
రానా, మిహికాలు 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకున్నారు. కరోనా సమయంలో వీరి పెళ్లి జరగడంతో పెద్దగా ప్రముఖులు ఎవరు హాజరు కాలేదు. వివాహం జరిగినప్పటి నుండి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తూ ఉన్నారు. ఆ మధ్య మిహికా ప్రగ్నెంట్ అని ప్రచారం జరిగింది. కాని దానిపై క్లారిటీ లేదు. అయితే అమెరికా వెకేషన్లో భాగంగా న్యూయార్క్ టైమ్స్ వద్ద స్టైలిష్ లుక్స్ లో దిగిన పిక్స్ మిహిక షేర్ చేసింది. ఇందులో ఇద్దరు చాలా క్యూట్‌గా కనిపించారు. మిహికా అయితే హీరోయిన్ని మించిన అందంతో కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రానా, మిహికా ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే కరోనా టైమ్ లో హౌస్ పార్టీ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్న రానా అందులో తెలిసినవాళ్లందర్నీ యాడ్ చేసుకున్నాడట. అలా ఓ సారి మిహికా పరిచయం కాగా, వారంలోనే రానా ప్రపోజ్ చేయడంతో షాక్ అయిందట మిహిక.నిజంగానే చెప్పాడా లేదంటే ప్రాంక్ చేస్తున్నాడా అని ముందు డౌట్ పడిందట. పెళ్లి చేసుకుంటా అని రానా క్లారిటీ ఇవ్వడంతో మిహికా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలా వారి పెళ్లి కరోనా సమయంలో అతి కొద్ది మంది మధ్య జరిగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
స్కౌట్ అండ్ గైడ్ది నిస్వార్థ సేవ
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

