Ramya Krishnan | రమ్యకృష్ణ ఊరమాస్.. కావాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులు
jailer Movie | ఈ మధ్య కాలంలో ఒక్క పాటతో సినిమాపై హైప్ వచ్చిందంటే అది జైలర్ విషయంలోనే జరిగింది. మూడు వారాల కిందట రిలీజైన కావాలా సాంగ్ సోషల్ మీడియాలో సృష్టిస్తున్న రికార్డులు అంతా ఇంతా కాదు.
jailer Movie | ఈ మధ్య కాలంలో ఒక్క పాటతో సినిమాపై హైప్ వచ్చిందంటే అది జైలర్ విషయంలోనే జరిగింది. మూడు వారాల కిందట రిలీజైన కావాలా సాంగ్ సోషల్ మీడియాలో సృష్టిస్తున్న రికార్డులు అంతా ఇంతా కాదు. మొదట్లో పాటపై రజనీ ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్ కొంత అసంతృప్తి చెందినా.. తర్వాత కొంచెం కొంచెంగా ఎక్కేసింది. ఇక ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో మొత్తం ఈ పాట హవానే. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన పాటకు తమన్నా మాములు ఎనర్జీతో స్టెప్పులు వేయలేదు. తమన్నా చేసిన పాటల్లో ది బెస్ట్ సాంగ్ ఇదే అనడంలో అతిశయోక్తి లేదు.
కాగా తాజాగా ఈ పాటపై రమ్యకృష్ణ స్టెప్పులేసింది. ఐదు పదుల వయసులోనే అదిరిపోయే స్పెప్పులేసి అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తుంది. తన సిబ్బందితో కలిసి రమ్యకృష్ణ స్టెప్పులేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, రజనీకి భార్యగా కనిపించనుంది. ఇక నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ గట్రా సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ చేశాయి.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్, ప్రియాంక అరుళ్మోహన్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

