వంద కోట్ల బడ్జెట్‌తో

ప్రస్తుతం భాషాభేదాలకు అతీతంగా రీమేక్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రాక్షసుడు’ చిత్రానికి రెండో భాగాన్ని తెరకెక్కించబోతున్నారు. ‘రాక్షసుడు-2’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్, హవీష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ రీమేక్ గురించి కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ “రాక్షసుడు’ మించి ఆసక్తికరమైన కథ, కథనాలతో కమర్షియల్ హంగుల్ని మేళవించి రూపొందించనున్నాం. థ్రిల్లింగ్ పాయింట్‌తో హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. పాన్ ఇండియన్ స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో అగ్రహీరో నటిస్తారు. వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం లండన్‌లోనే సాగుతుంది. ఇక ‘రాక్షసుడు’ చిత్రాన్ని మా సంస్థ ద్వారా హిందీలో పునర్నిర్మించాలని అనుకున్నాం. కొవిడ్ కారణంగా కుదరలేదు. ఈ చిత్ర హిందీ రీమేక్‌లో అక్షయ్‌కుమార్ నటించనున్నారు. రమేష్‌వర్మ ఈ సినిమాతో బాలీవుడ్లో దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నారు’ అని తెలిపారు. .
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Rakshasudu 2
- ramesh varma
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

