Sundaram Master | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా కొత్తదనంతో కూడిన కథలను అందించే పనిలో ఉన్నాడని తెలిసిందే. రవితేజ టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్‌కుమార్ కుర్రు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం సుందరం మాస్టర్ (Sundaram Master).
హర్షచెముడు (Harsha chemudu) లీడ్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ముందుగా ఫిబ్రవరి 16న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే సందీప్ కిషన్ నటిస్తున్న ఊరు పేరు భైరవకోన చిత్రాన్ని రీషెడ్యూల్ చేస్తూ ఇదే రోజున విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో.. సుందరం మాస్టర్ టీం మరో తేదీకి రిలీజ్ డేట్‌ను మార్చుకుంది. సుందరం మాస్టర్ చిత్రాన్ని ఫిబ్రవరి 23న విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ మరో పోస్టర్ లాంఛ్ చేశారు. ఇప్పుడీ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో హర్షచెముడు సార్ గెటప్‌లో కనిపిస్తుండగా.. గిరిజన మహిళలు, పురుషులు, చిన్నారులతో కలిసి దిగిన గ్రూప్ ఫొటోతోపాటు బ్యాచ్ 2023 అని క్యాప్షన్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఎప్పుడూ ఏదో కామెడీ టచ్ ఉండే పాత్రలో కనిపించే హర్ష చెముడు ఈ సారి ఎలాంటి కథాంశంతో రాబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
మేకర్స్ లాంఛ్ చేసిన టీజర్ హర్ష చెముడు ఆదివాసీలకు ఏబీసీడీలు నేర్పించే సన్నివేశాలతో మొదలై ఇంప్రెసివ్‌గా సాగుతుంది. పాఠాలు నేర్పించేందుకు వచ్చిన సుందరం మాస్టర్‌కు ఆదివాసులంతా ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ షాకిస్తుంటారు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడిపోతాడు హర్ష. టైటిల్ క్యాప్షన్‌లో 1930ని కొట్టేస్తూ.. 2023లో ఆదివాసీలు ఎలా ఉన్నారనే ఫన్ యాంగిల్‌ను సినిమాలో చూపించబోతున్నట్టు టీజర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. పక్కా ఫన్ ఎంటర్టైనర్గా సాగనున్న ఈ మూవీలో దివ్య శ్రీపాద ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Finally, the time table is locked for #SundaramMaster’s class ✅#SM greynd releaz varold vyde on 𝐅𝐄𝐁𝐑𝐔𝐀𝐑𝐘 𝟐𝟑𝐫𝐝!
Don’t miss out the attendance 📝@RaviTeja_offl @harshachemudu @SudheerKurru @kalyansanthosh8 @itswetha14 @NambuShalini @RTTeamWorks @GOALDENMEDIA… pic.twitter.com/nb6liAm0Ct— RT Team Works (@RTTeamWorks) January 31, 2024
సుందరం మాస్టర్ ఫస్ట్ లుక్..
Immensely pleased to announce our next in @RTTeamWorks 🤗
Here is the FUST LUK of #SM alias #SundaramMaster
Our boy @harshachemudu made it INTERNET to INTERNATIONAL @SudheerKurru @kalyansanthosh8 @itswetha14@NambuShalini @SricharanPakala @GOALDENMEDIA pic.twitter.com/zkuS4ZIRo0
— Ravi Teja (@RaviTeja_offl) June 22, 2023
సుందరం మాస్టర్ టీజర్..