Ram Gopal | ప్రముఖ దిగ్గజ నటుడు నానా పాటేకర్ ఆకస్మిక మృతి సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 75 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూయడంతో బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అయితే ఆయన హఠాన్మరణంపై ప్రముఖ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగభరితమైన నివాళులు అర్పించారు. నానా పాటేకర్ లాంటి ధృఢమైన వ్యక్తికి ఇలా అకస్మాత్తుగా జరగడాన్ని తాను నమ్మలేకపోతున్నానని వర్మ పేర్కొన్నారు.
“ఎవరూ అమరులు కాదనే విషయం అందరికీ తెలిసిందే.. కానీ అంతటి ధృఢమైన వ్యక్తికి ఇంత అకస్మాత్తుగా జరుగుతుందని నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఆయనను మోసం చేసిన గుండెను నేను ద్వేషిస్తున్నాను. అలాగే నటనకు దేవుడైన నానా పాటేకర్ ను బలిగొన్న ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది. గుడ్‌బై నానా.. ‘అబ్ తక్ చప్పన్’ (Ab Tak Chappan), ‘భూత్’, ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’ చిత్రాల ద్వారా మీరు అందించిన అద్భుతమైన నటనను ఎప్పటికీ మరచిపోలేను” అని ఆర్జీవీ తన ఆవేదనను పంచుకున్నారు. నానా పాటేకర్ మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా ఆయన అభిమానులకు తీరని లోటని పలువురు ప్రముఖులు మరియు సినీ ప్రముఖులు సైతం తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.