Klinkaara | ‘ఇదిగో మా చిన్ని క్లీంకార’.. పుట్టిన రోజున కూతురి ఫొటో పంచుకున్న రాం చరణ్, ఉపాసన..!
Klinkaara : టాలీవుడ్ స్టార్ హీరో రాం చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) దంపతులు తమ గారాల పట్టి క్లీంకార (Klinkaara) ఫొటోలు పంచుకున్నారు. ఈ మధ్యే రెండోసారి తల్లిదండ్రులైన ఈ జంట.. ఎట్టకేలకు క్లీంకార ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది.
Klinkaara : టాలీవుడ్ స్టార్ హీరో రాం చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) దంపతులు తమ గారాల పట్టి క్లీంకార (Klinkaara) ఫొటోలు పంచుకున్నారు. ఈ మధ్యే రెండోసారి తల్లిదండ్రులైన ఈ జంట.. ఎట్టకేలకు క్లీంకార ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఆమె మూడో పుట్టిన రోజును పునస్కరించుకొని ఇదిగో మా క్లీంకార అంటూ ఉపాసన పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరలైంది. అంతేనా.. లక్షల్లో లైకులు వచ్చేశాయి.
మూడేళ్ల క్రితం జూలై 20వ తేదీన రాం చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకార జన్మించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తమ పాప ముఖం ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడిందీ జంట. అయితే.. క్లీంకర మూడో సంవత్సరంలో అడుగుపెట్టిన రోజును మరింత ప్రత్యేకంగా మలుస్తూ.. అభిమానులను సంబురాల్లో ముంచుతూ తమ కూతురి ఫొటోను పంచుకున్నారు.
Happy Birthday #KlinKaara 🤍!@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/KCeYKNfxX6
— Megablood Brothers Durgara RaoGv (@MRaogv) June 20, 2026
చిరునవ్వులు చిందిస్తున్న క్లీంకార ఫొటో చూసినవాళ్లంతా అచ్చం అమ్మ ఉపాసనను పోలి ఉందిగా అని అనుకుంటున్నారు. ఈ మధ్యే రాంచరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చారు. కుమారుడికి శివ్రాం కొణిదెల, కూతురికి అన్వీరా దేవి కొణిదెల అని నామకరణం చేశారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన రాం చరణ్ ఇటీవల ‘పెద్ది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

